బుర్రు పిట్ట బుర్రు పిట్ట

10:37 AM Edit This 0 Comments »



బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది


పడమటింటి కాపురం చెయ్యనన్నది


అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది


మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది


మగనిచేత మొట్టి కాయ తింటనన్నది.

బుజ్జిమేక

11:42 AM Posted In , Edit This 0 Comments »

బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి ?
రాజుగారి తోటలోన మేతకెల్తిని.

రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?
రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని

పూల చెట్లు చూసి నీవు ఊరుకొంటివా ?
నోరూరగ పూల చెట్లు మేసి వస్తిని.

మేసి వస్తె నిన్ను భటులు ఏమి చేసిరి ?
భటులు వచ్చి నా కాళ్ళు విరగకొట్టిరి.

కాలు విరిగి నీవు ఊరుకొంటివా ?
మందుకోసం డాక్టరుగారింటికెల్తిని.

మందు ఇచ్హిన డాక్టరుకు ఏమి ఇస్తివి ?
చిక్కనైన తెల్లపాలు ఇచ్చి వస్తిని.

డాక్టరుకు పాలిచ్చి ఇంటి వద్ద ఏమిస్తావు ?
గడ్డి తినక ఒక పూట పస్తులుండి తీరుస్తా.

పస్తులుండి నీకు నీరసం రాదా ?
పాడు పనులు చేయనింక బుద్దివచ్చెనాకు

చిన్నారి పాట

5:14 PM Posted In , Edit This 0 Comments »


పాడుబడిన కోట - కోట వెనుక పేట
పేట వరకు బాట - బాట పక్కన తోట
తోటలోన మోట - మోట కోసం రాట
రాట తిరుగు చోట - రాగాల పాట
పాట పాడు నోట - పంచదార ఊట
అందుకే పూట పూట - వినిపించు పాట
చిన్నారి నోట - కొత్త పాట.